Delhi Crime: ప్రతి రోజు మహిళపై అఘాయిత్యం.. చిన్నారిపై అఘాయిత్యం అనే వార్తలు వింటూనే ఉన్నాం. అత్యంత దారుణమైన విషయం ఏంటి అంటే విద్యా బుద్దులు నేర్పిస్తారని ఉపాధ్యాయుడి వద్దకు పంపిస్తే అతడు కూడా కామాంధుడిగా మారి దారుణంగా వ్యవహరించడం జరుగుతుంది. పిల్లలపై టీచర్ అఘాయిత్యం అంటూ పదే పదే వార్తలు వింటూ ఉన్నాం. మరోసారి అదే సంఘటన పునరావృతం అయ్యింది. చట్టాలు ఎంత కఠినమైన చట్టాలు తీసుకు వచ్చినా కూడా కామాంధులకు ఆ క్షణంలో కళ్లు మూసుకు పోయినట్లుగా వ్యవహరిస్తున్నారు. అత్యంత దారుణంగా వ్యవహరిస్తూ నీచులుగా.. కీచకుల మాదిరిగా మారుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలోని న్యూ అశోక్‌ నగర్ ప్రాంతంలో స్థానికంగా ఉండే వారు కొంత మంది పిల్లలను 30 ఏళ్ల వ్యక్తి వద్దకు ప్రైవేట్‌ గా ట్యూషన్ క్లాసులకు పంపిస్తూ ఉన్నారు. అతడి వద్దకు పదేళ్ల బాలికను కూడా ట్యూషన్‌ కి అని పంపిస్తున్నారు. మొన్న శనివారం సాయంత్రం బాలిక ట్యూషన్ కి వెళ్లింది. ఆ రోజు ఆ బాలిక కాకుండా ఇతర పిల్లలు ఎవరు ట్యూషన్ కి వెళ్లలేదు. దాంతో బాలిక ఒంటరిగా ఉండటంతో ట్యూషన్ టీచర్ కీచకుడిగా మారాడు. బాలికను క్లాస్ రూం నుండి ఇంట్లోకి తీసుకువెళ్లాడు. మాయ మాటలు చెప్పి టీచర్‌ అఘాయిత్యంకు పాల్పడ్డాడు. తన కూతురు వయసు ఉన్న బాలిక అని కూడా గుర్తించకుండా అత్యంత నీచంగా అతడు ప్రవర్తించాడు. 


ప్రతి రోజు మాదిరిగా కాకుండా ఏడ్చుకుంటూ ట్యషన్ నుండి పాప రావడంతో తల్లిదండ్రులు ఎంక్వౌరీ చేసి షాక్ అయ్యారు. వెంటనే స్థానిక పోలీసు స్టేషన్ కు వెళ్లి ట్యూషన్ టీచర్ పై ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉన్న జనాలు అతడిపై తీవ్ర కోపంతో దాడికి దిగారు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ మొదలు పెట్టారు. ఈ కేసు విషయాన్ని డిప్యూటీ కమీషనర్‌ ఆఫ్ పోలీస్‌ అమృత గుగులోత్‌ పర్సనల్ గా తీసుకుని విచారిస్తున్నట్లుగా పేర్కొన్నారు. 


Also Read: AP Rains Alert: ఏపీలో ఇవాళ రాత్రి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తస్మాత్ జాగ్రత్త


మైనర్ బాలిక కి ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా ఆ బాలిక మానసిక పరిస్థితి నిమిత్తం కౌన్సిలింగ్ ఇస్తున్నట్లుగా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్‌ అమృత పేర్కొన్నారు. అతడి ని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే అతడిని ఉరి తీయాలంటూ కొందరు డిమాండ్‌ చేస్తూ ఉంటే అతడిని తమకు అప్పగించాలి అంటూ కొందరు పోలీసుల వద్ద డిమాండ్‌ చేస్తున్నారు. అతడిని వెంటనే కఠినంగా శిక్షించడం వల్ల ముందు ముందు ఇలాంటి కీచక టీచర్లు ఉండరు అంటూ సోషల్ మీడియా ద్వారా కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు.


Also Read: Weather Report Today: భారీ వర్షాల ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో స్కూల్స్ బంద్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి